← All thoughts

నా చిన్నప్పటి దోస్తులు

నా చిన్నప్పటి దోస్తులు

ఉన్నారా? అని చూసుకునే కళ్ళు

బడి కి రాకపోతే దిగులు

స్నేహం అనే పదం వినగానే

ఒకరి మొఖం ఒకరు చూసుకొని మురిసిపోయే ఆనందం

అర్ధం లేని ఆటలు ఎన్నో

వ్యర్థం కాని జ్ఞాపకాలు అన్నీ

ఒకరి ఇంటికి ఒకరు రావాలనుకునే బంధువులు

నా చిన్నప్పటి దోస్తులు

భుజం మీద భుజం

గమ్యం లేని ప్రయాణం

నా extra చాక్లెట్ కి అర్హులు

నా చిన్నప్పటి దోస్తులు

నాకు పడ్డ చెంప దెబ్బ

మా టీచరు మూర్ఖత్వం అట

ఆకలి మరిపించే ఆరాటం

అలుపెరుగని ప్రోత్సాహం

ఎన్ని రోజులైనా మొహమాటం లేదు

ఎంత ప్రయత్నించినా మల్లా దొరకరు

నా చిన్నప్పటి దోస్తులు.

-

dedicated to my childhood friends

Venkat and Santosh.

Originally published on Medium ↗